Breaking News

రహస్య జీవోలిస్తూ పారదర్శక పాలనంటే ఎలా?

Published on Tue, 01/28/2025 - 05:31

సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలపై నీతులు చెప్పిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌.. అధికారంలోకి వచ్చాక పారదర్శకతకు పాడె కట్టేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన ఏడు నెలల్లోనే 78 రహస్య జీవోలు విడుదల చేసి, పైకి మాత్రం పారదర్శక ప్రభుత్వం అని చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆయన నేతృత్వం వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకేరోజు ఏకంగా 6 రహస్య జీవోలు ఇచ్చి ఆయనేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నాడని చెప్పారు.

ఆ రహస్య జీవోలన్నీ కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పేవి, కన్సల్టెన్సీలకు బిల్లులు చెల్లించేవే అని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని, పవన్‌ సైతం అబద్ధాల్లో చంద్రబాబునే మించిపోయారని అన్నారు. తాము ఏ వివరాలను గోప్యంగా ఉంచబోమని, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని, ఇదే పారదర్శక పాలనకు సాక్ష్యమంటూ గత ఏడాది ఆగస్టు 30న ప్రకటించిన చంద్రబాబు, పవన్‌.. వాస్తవంలో అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారని వివరించారు.

కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధించి 36, మున్సిపల్‌ శాఖలో 14, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి 4, ఆర్థిక శాఖకు చెందినవి 5, ఇరిగేషన్‌లో 6, హోంశాఖలో 4 జీవోలు రహస్యంగా ఇచ్చారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చేతిలో ఉన్న పంచాయతీరాజ్, గ్రామీ­ణాభివృద్ధి శాఖలోనూ ఒకే రోజు 6 రహస్య జీవోలిచ్చారని, ఇవన్నీ కీలకమైన జీవోలేనని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఆ జీవోలన్నీ బహిర్గతం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నాగార్జున యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)