Breaking News

65.33 లక్షల మందికి రూ.1,800.96 కోట్లు

Published on Fri, 12/01/2023 - 05:17

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65,33,781 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు డిసెంబర్‌ 1న ఠంచన్‌గా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,800.96 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల­నాయుడు గురువారం పేర్కొన్నారు. పింఛన్‌ నగదు­ను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించినట్లు చెప్పారు. సచివాలయాల వలంటీర్లు శుక్ర­వారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్ద­కు వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.

లబ్ధిదారులకు పింఛన్‌ అందజేసే సందర్భంలో గుర్తింపు కోసం ఆధార్‌ నిర్ధారిత బయో­మెట్రిక్, ఐరిస్‌ తదితర విధానాలను అమలు చేస్తు­న్నా­మన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్‌ అందలేదనే ఫిర్యాదు రాకుండా.. అన్ని జా­గ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఐదు రోజుల్లోనే నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యేలా చర్య­లు తీసుకున్నామని చెప్పారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రి­యలో 15 వేల మంది సంక్షేమ, విద్య అసిస్టెంట్, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు భాగస్వా­ములు అవుతారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని డీఆర్‌డీఏ కార్యాలయాల్లోని కాల్‌ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)