Breaking News

కోనసీమలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి

Published on Wed, 10/08/2025 - 13:19

సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్‌ ఫైర్‌ వర్క్స్‌లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.

బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు.

 

కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్నిప్రమాదం

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)