ఇది దసరా కానుక కాదు.. దగా, మోసం: ఆటో కార్మిక సంఘం ఫైర్‌

Published on Sat, 10/04/2025 - 12:36

విజయవాడ:   ఆటో కార్మికులకు దసరా కానుక పేరుతో ఈరోజు(అక్టోబర్‌ 4వ తేదీ) జరిగే సభ మోసపూరిత సభ అంటూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలోని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది.  తాము చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్‌ను, ఎమ్మెల్యే బోండాను కలిస్తే, సీఎంను కలవడానికి వీల్లేదంటూ షరతులు పెట్టారని మండిపడ్డారు మరి అటువంటుప్పుడు ఈ రోజు జరగే సభ మోసపూరిత సభ కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పోలారి. 

‘ఆటో కార్మికులను చూసి చంద్రబాబు భయపడుతున్నారు. మా సమస్యల పై వినతిపత్రం తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ రోజు జరిగే సభలో వినతి పత్రం ఇస్తామని కలెక్టర్‌ను కలిశాం , ఎమ్మెల్యే బోండా ఉమాను కలిశాం. సీఎంను కలవడానికి వీల్లేదని మా వినతిని తిరస్కరించారు. ఈరోజు జరిపే సభ మోసపూరిత సభ. ఆటో డ్రైవర్లను బలవంతంగా బెదిరించి అధికారులు సభకు తీసుకెళ్లారు. 

సభలకు తరలిస్తే మంచి చేసినట్లు కాదు. నిజంగా మీరు మంచి చేస్తే స్వచ్ఛంధంగా మేమే తరలివస్తాం. సభకు బలవంతంగా ఆటో డ్రైవర్లను తరలించడం కాదు. ఇది దసరా కానుక కాదు..దగా మోసం. సూపర్ సిక్స్ పథకాలను భ్రష్టుపట్టించారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. ఏడాదిన్నరలో రూ. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన మీరు ఆటో డ్రైవర్లకు రూ. 400 కోట్లు ఇవ్వలేకపోతున్నారా?, ఈ సభలోనైనా మీ హామీలను నెరవేరుస్తూ ప్రకటన చేయాలి. లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అన్ని సంఘాలను కలుపుకుని పోరాడుతాం’ అని ఆయన హెచ్చరించారు. 

ఐఎఫ్‌టీయూ ప్రధానకార్యదర్శి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘చంద్రబాబు ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారు. మా వినతిపత్రాలను కూడా తీస్కోవడం లేదు. ఎన్నికల ముందు మేం అడగకుండానే హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. జగన్ రూ. 10 వేలు ఇచ్చాడు మేం రూ. 15 ఇస్తున్నామంటున్నారు. .చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తెలియదు.

పవన్‌ను చూసి ఓటేసిన నిరుద్యోగులు, యువత మోసపోయారు. మాకు ఇస్తామన్న ఆటో డ్రైవర్ లేవలో అనేక కొర్రీలు పెట్టారు. పెండింగ్ చలానాలు కడితేనే వాహనమిత్ర ఇస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించడం సిగ్గు చేటు. జీవో నెంబర్ 21 రద్దు చేయలేదు. చంద్రబాబు నువ్వు మర్చిపోతే నీ ఎన్నికల మ్యానిఫెస్టోను చదువుకో. వీడియోలు చూసి గుర్తు తెచ్చుకో.సింగ్ నగర్ వేదికగా మాకు ఇచ్చిన ఐదు హామీలు నెరవేర్చాలి. అప్పటి వరకూ మా ఉద్యమం ఆగదు’ అని వార్నింగ్‌ ఇచ్చారు.

ఇక్కడ చదవండి: 
ఇంకో దుర్మార్గానికి తెర లేపుతున్నారు!

Videos

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)