Breaking News

జుట్టు పట్టుకొని ఈడ్చేసి.. కాళ్లతో తొక్కేసి

Published on Fri, 07/04/2025 - 03:54

లబ్బీపేట(విజయవాడ తూర్పు): పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ వైద్యులతో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఎదుట ధర్నా చేస్తున్న వారిపై మరో­సారి పోలీసులను ఉసిగొల్పింది. దీంతో యువ వైద్యులను పోలీసులు కాళ్లతో తొక్కేసి.. జట్టు పట్టుకొని ఈడ్చేశారు. నేరతుల కంటే దారుణంగా.. వారిని బలవంతంగా ట్రక్కు­ల్లోకి ఎత్తిపడేశారు. వారికి అండగా నిలిచిన విద్యార్థి సంఘాల నాయకులను సైతం అరెస్ట్‌ చేసి రాత్రి వరకు నిర్భందించారు.  

మూకుమ్మడిగా మీద పడి లాక్కెళ్లారు.. 
విదేశాల్లో మెడికల్‌ కోర్సులు పూర్తి చేసిన వందలాది మంది యువ వైద్యులు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. మంత్రులను సైతం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో నాలుగు రోజులుగా విజయవాడలో ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ కార్యాలయం ఉన్న హెల్త్‌ యూనివర్సిటీ ఎదుట నిరసన తెలుపుతున్నారు. గురువారం కూడా శాంతి­యుతంగా నిరసన తెలుపుతున్న వారికి వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్‌కుమార్, కార్యదర్శి ఐ.రాజేశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపి తదితరులు మద్దతు తెలిపారు.

ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డి.శ్రీహరిరావు కారును అడ్డుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరా­రు. ఇంతలో సెంట్రల్‌ ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ ప్రకాష్ తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు హెల్త్‌ యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. మూకుమ్మడిగా వైద్య విద్యార్థులపై పడి.. వారిని ఈడ్చేశారు. మహిళా వైద్యు­లని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్లి ట్రక్కుల్లో పడేశారు.

దీంతో పలువురు గాయపడ్డారు. అన­ంతరం వారిని ఎంజీ రోడ్డులోని ఏఆర్‌ గ్రౌండ్‌కు తరలించారు. పోలీస్ లు తమ పట్ల కర్కశంగా వ్యవహరించారని యువ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్‌ చేయలేకపోతే.. చంపేయండి అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.  

యువ వైద్యుల జీవితాలతో సర్కార్‌ చెలగాటం.. 
వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ యువ వైద్యులను పరామర్శించారు. వారి సమస్య పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. యువ వైద్యుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)