Breaking News

‘అమాయకులు బలికావొద్దనే సంయమనం పాటించాం’

Published on Sat, 08/05/2023 - 15:21

సాక్షి, విజయవాడ: అన్నమయ్య జిల్లాలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. పుంగనూరులో చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులపై దాడులు చేశారు. ఇక, ఎల్లో బ్యాచ్‌ దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడిని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. 

ఈ సందర్భంగా పోలీసులు అధికారుల సంఘం ప్రతినిధులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తల దాడుల్లో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరులో​ టీడీపీ కార్యకర్తల విధ్వంసాన్ని పోలీసులు అరికట్టారు. చంద్రబాబు కావాలనే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పుంగనూరులో అనుమతి లేకుండగా టీడీపీ కార్యకర్తలు చొరబడ్డారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో పోలీసులు సంయమనం కోల్పోతే పుంగనూరులో​ పరిస్థితి మరోలా ఉండేది. ఇది పోలీసుల చేతకానితనం అనుకుంటే పొరపాటే. ఈ దాడిలో అమాయకులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదనే సంయమనం పాటించాం. పుంగనూరు ఘటనపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేయమని డీజీపీని కోరాం. మాకు అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఒక్కటే అని స్పష్టం చేశారు. 

విచారణకు డీజీపీ ఆదేశం..
ఇదిలా ఉండగా.. పుంగనూరు ఘటనపై విచారణకు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశించారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డీజీపీ అన్నారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. లా అండ్ ఆర్డర్‌కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 

సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నాం. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించాం. మరికొందరి కదలికలపై నిఘా పెట్టాం. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుంది. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టాం. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేదిలేదన్నారు. ఇక, పుంగనూరు పీఎస్‌లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఐపీపీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: టీడీపీ రౌడీల దాడి: పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)