Breaking News

నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌..

Published on Sun, 10/05/2025 - 04:59

సాక్షి, నంద్యాల: ఆమె భర్తను కోల్పోయిన ఒంటరి మహిళ. దీంతో ఆ సీఐ కన్నుపడింది. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌..! నిన్ను, నీ పిల్లలను బాగా చూసుకుంటాను’’ అంటూ మాటలు కలిపాడు. లోబర్చుకునేలా పొగిడాడు.  పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు నీతో సంబంధమే లేదు పో అంటూ తిరస్కరిస్తున్నాడు. దీంతో నంద్యాల పట్టణంలోని మూల­సాగరానికి చెందిన బాధితురాలు శనివారం మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంది.

ఆమె చెప్పిన వివరాలు... ‘‘నా భర్త రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నాకు రైల్వేలో ఉద్యో­గం ఇచ్చారు. నంద్యాల త్రీటౌన్‌ సీఐ కంబగిరి రాముడుది మా ఊరే. 8 నెలల క్రితం ఫోన్‌లో పరిచయమయ్యారు. సొంత ఊరి వారవడంతో అరమరికలు లేకుండా  మాట్లాడాను. ఖాళీగా ఉంటే స్టేషన్‌ వద్దకు రా అంటూ పిలిచేవారు. ఈ విధంగా మా మధ్య చనువు ఏర్పడింది. అయితే, సీఐ మభ్యపెట్టి నా వీడియోలు, ఫొటోలు తీశారు. వీటిని చూపిస్తూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఐజీ, నంద్యాల జిల్లా గత ఎస్పీకి పలుసార్లు ఫిర్యాదు చేసినా వారు ఆయనకే వత్తాసు పలికారు.’అనిఆవేదన వ్యక్తం చేసింది.

పిల్లల్ని చంపేస్తా.. గంజాయి కేసు పెడతా
నా వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని, నన్ను, నా పిల్లలను చంపేస్తానని, గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించారు. నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నా­రని గత ఎస్పీకి ఫిర్యాదు చేశా. ఆ తర్వాత ‘‘నీ ఫొటోలు అన్నీ డిలీట్‌ చేయించా. సీఐ ఇక నీ జోలికి రాడు. ఆయనపై కేసు పెట్టొద్దు అని డీఎస్పీ తెల్లకాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు.

నేను కర్నూలు డీఐజీని కలిసేందుకు వెళ్లి... సీఐ పేరు చెప్పగానే ఇక్కడినుంచి వెళ్లు, ఏమైనా ఉంటే అక్కడ తేల్చుకో అని కసురుకుని పంపించేశారు. సీఐ కారణంగా మాన­­సికంగా కుంగిపోయా. ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నా. కూటమి ప్రభు­త్వంలో మహిళలకు న్యాయం జరగడం లేదు’’ అని బాధితు­రాలు వాపోయింది. కాగా, మహిళ ఆరోపణలపై సీఐ కంబగిరిరాముడును ఫోన్‌లో వివరణ కోరగా స్పందించలేదు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)