పల్నాడులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు.. మేరుగు రాధా, కొండా శీను..

Published on Sat, 06/21/2025 - 12:34

సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతల టార్గెట్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులపై పోలీసుల అక్రమ కేసులు పెట్టారు. ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను పేర్కొన్నారు.

👉ఇక, వైఎస్సార్‌సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పుష్ప-2 సినిమాలో డైలాగు పోస్టర్ రూపంలో చూపించిన బోల్లెద్దు రవితేజ కేసులో గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. ఈ కేసులో 223, 352, 351(2), 189(3), 192, 61(2), 126(2), 288, 298, 192 BNS r/w 190(2), BNS నాన్ బెయిల్ బుల్ సెక్షన్లతో కేసు నమోదు చేయడం గమనార్హం.

👉అలాగే, రాజుపాలెం మండలం బలిచేపల్లికి చెందిన మేరుగ రాధాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌ బుక్‌లో వచ్చిన పోస్టును ఆమె.. ఫార్వర్డ్ చేసినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడం విశేషం.

👉మాచర్ల వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగ నాయకుడు కొండా శీనును నిన్న సాయంత్రం గుంటూరులో దుర్గి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినందుకు కొండా శీనును పోలీసులు తీసుకెళ్లారు. అయితే, కొండా శీనుకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.

 

 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)