Breaking News

తీరిక లేదా అనితమ్మా!?

Published on Wed, 07/10/2024 - 05:10

సాక్షి, అనకాపల్లి: సొంత జిల్లాలో బాలికను ఒక దుండగుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించక­పో­వడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రధా­నంగా బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమ­యంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చ­నీయాంశమవుతోంది. 

రాంబిల్లి మండలం కొప్పు­గుండుపాలెంలో ఈనెల 6వ తేదీ సాయంత్రం 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని (14) అనే బాలిక­ను బోడాబత్తుల సురేష్‌ కత్తితో దాడిచేసి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటివరకు నిందితుడి ఆచూకీ లేదు. మైనర్‌ బాలిక హత్యకేసు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఎటు­వంటి భరోసా దక్కలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బాలిక హత్య కేసుపట్ల హోంమంత్రి కనీసం దృష్టిసారించక­పోగా.. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్ప­కపోవడంపట్ల గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నా­రు. 

దొరకని నిందితుని ఆచూకీ..
ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీ దొరకలేదు. నిజానికి.. నిందితుడు సురేష్‌ ఒక నేరానికి సంబంధించి జైలుకెళ్లి బెయిల్‌పై విడు­దలయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు నిఘా పెట్టకపోవడం కూడా ఈ హత్యకు దారితీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెయిల్‌ మీద వచ్చాక బస్సులో ఒకరోజు బాధితురాలి వెంట­పడ్డాడని.. ఈ విషయం వెంటనే పోలీసుల దృష్టికి బాలిక తండ్రి వెంకటరమణ తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు.

ఈ విషయమై మంత్రి అనితను మీడియా సమావేశంలో ఒక విలేకరి ప్రశ్నించగా.. అదే నిజమైతే సదరు పోలీసు అధికా­రిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ విషయాన్ని విస్మరించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించి అతని ఫొటోలు విడుదల చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)