Breaking News

జీవో 85ను రద్దు చేయండి

Published on Sun, 09/22/2024 - 04:20

సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్‌: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపునకు సంబంధించిన జీవో నంబర్‌ 85ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) వైద్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి ఏపీ పీహెచ్‌సీ వైద్యుల సంఘం లేఖ రాసింది. ‘నిర్దేశిత పరీక్షకు కేవలం 20 రోజుల ముందు ప్రభుత్వం ఇన్‌సరీ్వస్‌ కోటాను కుదిస్తూ నిర్ణయం తీసుకుని జీవో 85ను జారీ చేసింది.

దీంతో మాకు న్యాయపరమైన మార్గం చూసుకునే అవకాశం లేకుండాపోయింది. జీవో 85పై మేము జూలై 23న వైద్య శాఖ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమరి్పంచాం. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లకు వినతిపత్రాలు సమర్పిం­చాం. గత 50 రోజులుగా మా బాధను చెబుతూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇక దిక్కుతోచని స్థితిలో ఆందోళన బాటపట్టాం. 

జీవో 85 రద్దు చేసి.. ఇప్పటికే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు మరిన్ని పీజీ సీట్లు ఇవ్వడం వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. మా డిమాండ్లు అన్నింటినీ వెంటనే పరిష్కరించండి’ అని ప్రభుత్వాన్ని పీహెచ్‌సీ వైద్యుల సంఘం డిమాండ్‌ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు శనివారం కూడా తమ నిరసన కొనసాగించారు. పీజీలో ఇన్‌ సర్వీస్‌ కోటాను కుదించడాన్ని ఖండిస్తూ జీవో నంబర్‌ 85ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట వైద్యులు తమ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)