Breaking News

బ్యాంకుల నుంచి పింఛన్‌ డబ్బు విత్‌డ్రా.. ఇకపై ఒక్కరు కాదు ఇద్దరు.. 

Published on Sun, 04/30/2023 - 10:07

సాక్షి, అమరావతి: ప్రతి నెలా అవ్వాతాతల పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డబ్బులను బ్యాంకుల నుంచి విత్‌ డ్రా చేసే బాధ్యతను ఇకపై ఇద్దరేసి సచివాలయ ఉద్యోగులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు. గ్రామాల్లో సచివాలయ పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ ఇద్దరూ కలిసి బ్యాంకుల నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయాలని ఆదేశాలిచ్చారు. 

పట్టణ ప్రాంతాల్లో వార్డు అడ్మిన్‌ సెక్రటరీ, వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ ఈ బాధ్యతను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా రూ.1,750 కోట్లను ప్రభుత్వం పింఛన్లుగా అందజేస్తోంది. లబ్ధిదారుల సంఖ్య మేరకు పింఛన్‌ డబ్బులను ఆయా సచివాలయాల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తోంది. సచివాలయ సిబ్బంది ఒకరు బ్యాంక్‌కు వెళ్లి ఆ డబ్బులను తీసుకువచ్చి.. వలంటీర్లకు అప్పగిస్తారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలు బ్యాంకుల నుంచి డబ్బులు విత్‌ డ్రా చేస్తున్నారు. కొన్నిచోట్ల సిబ్బంది నగదు విత్‌ డ్రా చేసి తీసుకెళ్తున్నప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి వల్ల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభు­త్వం మళ్లీ నిధులు విడుదల చేయాల్సి వస్తోంది. 

ఏప్రిల్‌ 3న అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో ఓ సచివాలయ మహిళా ఉద్యోగి బ్యాంక్‌ నుంచి రూ.16.15 లక్షలు తెస్తుండగా.. దొంగలు దోచుకెళ్లా­రు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు తాజా ఆదేశాలు జారీ చే­శారు. బ్యాంక్‌ల నుంచి పింఛన్‌ డ­బ్బులు డ్రా చేసిన దగ్గర నుంచి వలంటీర్లు నగదు పంపిణీ చేసే వ­రకు జాగ్రత్తలు తీసుకోవాలని సూ­చిం­చారు. సచివాలయ ఉద్యోగులిద్దరూ నగదుకు బాధ్యత వహించాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల పర్యవేక్షణలోనే  సొ­మ్మును విత్‌ డ్రా చేయాలన్నారు.

ఇది కూడా చదవండి: ఆపరేషన్‌ కావేరీ.. సూడాన్‌ నుంచి ఏపీకి 48 మంది క్షేమంగా.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)