Breaking News

సినీ, రాజకీయాల్లో రారాజు.. కృష్ణంరాజు: మంత్రి రోజా

Published on Mon, 09/12/2022 - 10:38

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణంరాజు భౌతికకాయానికి సోమవారం నివాళులర్పించారు ఏపీ మంత్రులు. నివాళులు అర్పించిన వాళ్లలో మంత్రులు కారుమూరి, వేణుగోపాలకృష్ణ, రోజా తదితరులు ఉన్నారు. ఈ సందర్భగా.. పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ..

 

సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రారాజు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. 

ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారి అకాల మరణం బాధాకరం. ఈ వార్త తెలిసి.. ముఖ్యమంత్రి జగన్ చాలా దిగ్భ్రాంతి చెందారు. కృష్ణంరాజుగారు.. రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహ పూర్వకంగా వుండేవారు. ఏపీ తరపున మా మంత్రుల బృందం ఆయనకు నివాళులర్పించింది.

మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు సేవలు మరువలేనివి. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై వుండేవారు. 

ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. కృష్ణంరాజు మరణం చాలా బాధాకరం. ఆపదలో వున్న ఎవరికైనా సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి కృష్ణంరాజు. సూర్య చంద్రులు వున్నంత వరకు అయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గా మిగిలిపోతారు.

విశ్వరూప్ మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారు సినీ పరిశ్రమలో ఓ ధృవ తారా. నర్సాపురం లో ఏ గ్రామానికి వెళ్లిన ఆయన జాడలు కనిపిస్తాయి. రాజకీయాలలో హుందా కలిగిన వ్యక్తి.

ఇదిలా ఉంటే.. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు హాజరుకానున్నారు.

ఇదీ చదవండి: రెబల్‌స్టార్‌ మృతి పట్ల ఏపీ ప్రముఖుల సంతాపం

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)