Breaking News

మూడు రాజధానులే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలసీ: అంబటి

Published on Wed, 02/15/2023 - 14:17

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అంబటి రాంబాబు మరోమారు స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష‍్యమని చెప్పారు. భవిష్యత్తులో సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదు అంటే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని పేర్కొన్నారు.

'వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విధానం మూడు రాజధానులే. దీనికి కారణమేమిటంటే సమతుల్యం.  మూడు ప్రాంతాలను సమానంగా చూసుకోవాలనే భావన. ఇంతకుముందు మనకు ఈ రాష్ట్రంలో చాలా అనుభవాలు ఉన్నాయి. రీజినల్ ఫీలింగ్స్ ఉన్నాయి. దాని వల్ల ఒకసారి దెబ్బతిన్నాం. తెలంగాణ ఫీలింగ్‌తో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వంటి గొప్ప ప్రదేశాన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ అక్కడే ఉన్నాయి.

కానీ అలా ఉండకుండా అన్ని చోట్లా అభివృద్ధి జరగాలనే సదుద్దేశంతో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మూడు రాజధానులు అవసరం. మూడు రాజధానులంటే ఒకటి రాయలసీమకి, ఒకటి కోస్తా ఆంధ్రకి, ఒకటి ఉత్తరాంధ్రకి ఇ‍చ్చి అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచడంతో పాటు, ఓన్ చేసుకునే విధానాన్ని చేయటం. దీని వల్ల భవిష్యత్తులో ఏ విధమైన ఆందోళన, అభద్రతా భావం ఏ ప్రాంతానికీ ఉండకూడదనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది తప్ప మరొకటి కాదు. అది మా పాలసీ. ఆ పాలసీకే కట్టుబడి ఉన్నాం. మీరు దాని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు.' అని అంబటి అన్నారు.
చదవండి: అపోహలొద్దు.. మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)