Breaking News

పోలీసులు వేధిస్తున్నారు

Published on Tue, 11/04/2025 - 04:59

తిరుపతి అర్బన్‌: పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఎస్వీ మెడికల్‌ కళాశాల విద్యార్థులు తిరుపతి కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలో చదువుతున్న 500 మంది విద్యార్థులు వెస్ట్‌ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలిపి కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 1 రాత్రి ఆస్పత్రిలో విధులు పూర్తయిన త­ర్వా­త వైద్య విద్యార్థులు హరీష్, జయంత్‌ భోజనం కోసం వెస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ వైపు బైక్‌పై వెళుతుంటే పోలీసులు ఆపారని చెప్పారు.

తాము మెడికల్‌ విద్యార్థులమని చెప్పినా తమపై దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. తా­ము వారిని గట్టిగా ప్రశ్నిస్తే దాడి చేశారని చెప్పారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి ఎస్‌ఐకి ఫిర్యాదు చేశామనీ ఆయనతో పాటు యూనిఫాంలో లేని కొందరు లాఠీలతో దాడి చేశారని చెప్పారు. డ్యూటీల నిమిత్తం వైద్య విద్యార్థి, విద్యార్థిని వెళుతుంటే అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు.

తమ మొబైల్, స్కూటర్‌ను లాక్కున్నా­రని వివరించారు. ఆస్పత్రిలో డ్యూటీలు చేస్తూ కాఫీ, టీ తాగడానికి రోడ్లపైకి వచ్చినా పోలీసులు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలో న్యా­యం కోసం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చి త­మ సమస్యను వివరించినట్లు వెల్లడించారు. వైద్య వి­ద్యా­ర్థులకు పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)