Breaking News

ఒకే దెబ్బతో చంపడం ఎలా?.. యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి..

Published on Fri, 02/14/2025 - 16:56

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. వ్యసనాలకు బానిసైన కొడుకు.. యూట్యూబ్‌లో వీడియో చూసి తండ్రి హత్యకు స్కెచ్ వేశాడు. అనుమానం రాకుండా భూ తగాదాలో ప్రత్యర్థులు హతమార్చినట్లు డ్రామాలాడాడు. పోలీసుల విచారణతో మర్డర్ మిస్టరీ వీడింది. ఈ నెల 8వ తేదీన మైలవరం మండలం మెర్సుపల్లి వద్ద వక్తి మృతదేహం లభ్యం కాగా,  మృతుడు ములకలపెం గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావుగా పోలీసులు గుర్తించారు.

వ్యవసనాలకు బానిసై తండ్రి శ్రీనివాసరావును హతమార్చిన కొడుకు పుల్లారావు.. పేకాట, ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లలో డబ్బు పోగొట్టుకున్నాడు. గతంలో పుల్లారావు చేసిన నాలుగు లక్షల అప్పును తండ్రి శ్రీనివాసరావు తీర్చాడు. వ్యసనాలకు బానిసై అప్పుల పాలైన కొడుకు పుల్లారావును పలుమార్లు తండ్రి మందలించాడు. దీంతో తండ్రిని చంపేందుకు పుల్లారావు స్కెచ్ వేశాడు.

యూట్యూబ్‌లో సీరియల్ కిల్లర్ మర్డర్ వీడియోలు చూసిన పుల్లారావు.. ఒకే దెబ్బతో ఎలా మనిషి ప్రాణం తీయొచ్చు అని యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. పథకం ప్రకారం ఈనెల 8వ తేదీన పొలంలో ఉన్న తండ్రిని కర్రతో కొట్టి చంపేశాడు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయంటూ డ్రామాకు తెరతీసిన మృతుడి కుమారుడు పుల్లారావు.. కేసు తనపైకి రాకుండా ఉండేందుకు గ్రామస్తులతో కలిపి నిరసనలు చేపట్టాడు. పోలీసుల విచారణలో పుల్లారావే హంతకుడని నిర్థారణ కావడంతో నిందితుడిని మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)