Breaking News

19 కేసులు: 18 ఎఫ్ఐఆర్‌లపై ఏపీ హైకోర్టు స్టే

Published on Thu, 05/01/2025 - 15:27

అమరావతి:   సోషల్ మీడియా యాక్టివిస్ట్ మునగ హరీశ్వరరెడ్డికి  ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. హరీశ్వరరెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన 19 కేసుల్లో భాగంగా 18 ఎఫ్ఐఆర్ లపై హైకోర్టు స్టే విధించింది. ఒక్క ఎఫ్ఐఆర్ మినహా మిగిలిన 18 ఎఫ్ఐఆర్ లపై హైకోర్టు స్టే విధించింది. దాంతో ఒక్క ఎఫ్ఐఆర్ మీద దర్తాప్తునకు హైకోర్టు అనుమతి ఇచ్చినట్లయ్యింది.   18 కేసుల్లో స్టే విధించడంపై ప్రజాస్వామ్య వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అక్రమ కేసులు పెడుతున్న చంద్రబాబు సర్కారుకు ఇది చెంపపెట్టు వంటిదని వారు అంటున్నారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు , మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ హరీశ్వరరెడ్డి హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు గత వారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాలకు మేర తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్లు లోపు శిక్ష పడే కేసుల్లో కూడా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారని, మేజిస్ట్రేట్లు తగిన కారణాలు కూడా వెల్లడించటం లేదన్నారు.

ఇది అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించడమే అవుతుందని,  హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.  లోపు భూయిష్ట ఉత్తర్వులను తమ దృష్టికి తీసుకువస్తే హైకోర్టు చర్యలు తీసుకుంటామందని, అందుకే నిబంధనలు పాటించలేని కొన్ని కేసులను తమ దృష్టికి తీసుకువస్తున్నట్లు హరీశ్వరరెడ్డి ఫిర్యాదులో వెల్లడించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)