Breaking News

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Published on Mon, 07/21/2025 - 21:24

ఏపీ హైకోర్టు: సంక్షేమ హాస్టళ్ళ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు పైన దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు మండిపడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.  

సంక్షేమ హాస్టల్లో పిల్లల అవస్థలు మీకు కనిపించడం లేదా?.కటిక నేలపై పిల్లలు ఎలా పడుకుంటారు?  పిల్లల్ని మనం మన ఇళ్ల వద్ద అలాగే పడుకో బెట్టుకుంటున్నామా..?. కనీసం సన్నపాటి పరుపు, దుప్పటి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా..? బడ్జెట్ కేటాయింపులన్నీ ఎక్కడికి పోతున్నాయి అని ప్రశ్నించిన హైకోర్టు..కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆ డబ్బులు ఖర్చు చేస్తున్నారా? అని దుయ్యబట్టింది.

పిల్లల సంక్షేమమే తమకు ముఖ్యమని స్పష్టం చేసిన హైకోర్టు..ప్రతి జిల్లాలో సీనియర్ అధికారి స్థాయిలో తనిఖీలు చేయాలి. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన నివేదికలను ప్రతినెలా మా ముందు ఉంచండి అని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 

ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాజీ పడే సమస్య లేదు. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సాంఘిక,బీసీ, గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శిను బాధితులుగా చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలపై విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ ఆన్‌లైన్‌ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. 

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)