Breaking News

ఏపీ పోలీసులపై హైకోర్టు మరోసారి సీరియస్‌

Published on Tue, 07/29/2025 - 21:03

సాక్షి,అమరావతి: పోలీసులపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించం అంటూ హెచ్చరించింది. గుత్తి కొండకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పఠాన్ కరీమ్‌ గతంలో టీడీపీ నేతలపై ఓ కేసు పెట్టారు. ఆ కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ పఠాన్‌పై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. 

ఈ మేరకు పఠాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై పఠాన్‌ భార్య ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.

విచారణలో భాగంగా హైకోర్టులో విచారణకు హాజరైన పిడుగురాళ్ల టౌన్ సిఐ వెంకట్రావుపై ప్రశ్నలు వర్షం కురిపించింది.కేసు రాజీ చేసుకోమని పిడుగురాళ్ల సీఐ వెంకటరావు ఎలా వేధించాడో ధర్మాసనానికి పఠాన్‌ కరీమ్‌ వివరించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. కేసు రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి తీసుకొస్తారో.. ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు. మాకు ఏమీ తెలియదు అనుకోవద్దు. అలా అనుకునేందుకు మేమేం ఐఫిల్ టవర్‌పై కూర్చోలేదు

ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారు.ఇలాంటివి మేము రోజు చూస్తూనే ఉన్నాం. పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుంటే సహించేది లేదు. పిడుగురాళ్ల టౌన్ సీఐ జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టుకు రావచ్చు అని కరీంకు ధర్మాసనం చెప్పింది.

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)