మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు
Breaking News
మచిలీపట్నం పోలీసులకు ఎదురుదెబ్బ
Published on Wed, 03/11/2026 - 09:25
సాక్షి, విజయవాడ: మచిలీపట్నం పోలీసులకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు ఏపీ హైకోర్టులో ఉపశమనం దక్కింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని పోలీసులకు హైకోర్టు గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ రద్దు చేయాలని మచిలీపట్నం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు షరతులు ఉల్లంఘించారంటూ పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం, ఏపీ కోర్టు.. పోలీసుల పిటిషన్ను తోసిపుచ్చింది. కోర్టు షరతులను జయసుధ ఉల్లంఘించలేదని గుర్తు చేసింది. ఈ క్రమంలో జయసుధ ముందస్తు బెయిల్ను రద్దు చేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. అయితే, రేషన్ బియ్యం అక్రమ కేసులో జయసుధకు ఇప్పటికే మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Tags : 1