నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...
Breaking News
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు
చైనాలో ఎంత బంగారమైనా కొనొచ్చా? గోల్డ్ రూల్స్ ఇవే..
ట్రంప్‌కు ‘శాంతి’నిచ్చి.. ప్రతిపక్షంలో మచాడో కలకలం!
AP: వర్రా రవీంద్రారెడ్డి పిటిషన్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
Published on Wed, 11/20/2024 - 18:57
సాక్షి,గుంటూరు: సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్‌పై బుధవారం(నవంబర్ 20) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.చట్టనిబంధనలు,కోర్టు ఆదేశాల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని కడప పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని కడప పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.రవీంద్రారెడ్డి అరెస్టుకు సంబంధించి పుల్లూరు టోల్ ప్లాజా సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది.
హైకోర్టులో వర్రా రవీంద్రారెడ్డి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు..
- ఈ పిటిషన్ పౌరుని హక్కులకు సంబంధించింది
- ఒక పౌరుడు దుస్థితిని ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలి
- నిందితుల హక్కులను హరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇటీవలే ఒక కీలక తీర్పు ఇచ్చింది
- వర్రా రవీంద్రారెడ్డి రెడ్డి విషయంలో పోలీసులు పలు చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు
- కోర్టును తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చారు
- రవీంద్రారెడ్డి హైకోర్టు ముందు హాజరు పరచాలని ధర్మాసనం ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరు పరిచారు
- 24 గంటల్లో వర్రా రవీంద్రారెడ్డి రెడ్డిని కోర్టులో హాజరపరచాల్సిన పోలీసులు 48 గంటల పాటు అక్రమ నిర్బంధంలో ఉంచారు
- రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రస్తుతం ఇలానే వ్యవహరిస్తున్నారు
- చట్ట నిబంధనలు, కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదన్న హెచ్చరికలు పోలీసులకు పంపాల్సిన సమయం ఆసన్నమైంది
- రాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా నిర్బంధించి హింసిస్తున్నారు
- అధికార పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారు
- ఇవేవీ పోలీసులకు కనిపించడం లేదు
- వారి జోలికి వెళ్లే ధైర్యం కూడా పోలీసులు చేయడం లేదు
- కొంతమంది పోలీసులను ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తాం
#
Tags : 1