Breaking News

AP: వాటిని బహిర్గతం చేయాలా?వద్దా? తేలుస్తాం: హైకోర్టు

Published on Fri, 01/20/2023 - 09:47

సాక్షి, అమరావతి: పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరా­లను బహిర్గతం చేయాలా? వద్దా? అన్న అంశంపై లోతుగా విచారించి తేలుస్తామని హైకోర్టు తెలిపింది. అలా కేసులు నమోదు చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టు స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేసేందుకు హోం­శాఖ న్యాయవాది వి. మహేశ్వరరెడ్డి గడువు కోర­డంతో హైకోర్టు తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయ­మూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురు­వారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో తనపై నమోదైన కేసుల వివ­రాలు, వాటికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ­లతో పాటు కేసులు నమోదు చేయని ఫిర్యాదుల వివ­రాలను తనకు అందజేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దీనిపై జస్టిస్‌ రాయ్‌ గురువారం మరోసారి విచారణ జరి­పారు. రఘురామరాజు తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ వాదనలు వినిపిస్తూ, పెండింగ్‌లో ఉన్న ఫిర్యా­దుల ఆధారంగా కేసులు నమోదు చేసి వాటి­లో పిటిష­నర్‌ను అరెస్టుచేసే అవకాశం ఉందన్నారు. పిటిష­నర్‌ విషయంలో పోలీసులు కుట్ర­పూ­రితంగా వ్యవ­హ­రిస్తున్నారని, అందుకే ఆ ఫిర్యా­దుల వివరాలను వెల్లడించలేదన్నారు. ఈ వాద­నను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇది ఊహాజని­తమైన­దన్నారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గడువునిస్తూ విచారణను పది రోజులకు వాయిదా వేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)