Breaking News

99 పైసలకే 22 ఎకరాలు.. బాబు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం

Published on Thu, 08/14/2025 - 07:16

సాక్షి, అమరావతి: విశాఖపట్నం, మధురవాడలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు 22 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకే కేటాయించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 24వ తేదీకి వాయిదా వేసింది.

ఇదే సమయంలో టీసీఎస్, లులు కంపెనీలకు భూ కేటాయింపు­లను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కూడా కాగ్నిజెంట్‌కు సంబంధించిన పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అన్నింటినీ కలిపి విచారిస్తామని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

99 పైసలకే 22 ఎకరాల భూ కేటాయింపులపై పిల్‌...
కాగ్నిజెంట్‌ కంపెనీకి భూ కేటాయింపులను సవాలు చేస్తూ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ రైట్స్‌ విశాఖ జిల్లా అధ్యక్షురాలు నక్కా నమ్మిగ్రేస్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ,  విశాఖ నడిబొడ్డున రూ.1,109 కోట్ల విలువ చేసే 22 ఎకరాల భూమిని ప్రభుత్వం కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చిందన్నారు. సేల్‌డీడ్‌ ద్వారా కాగ్నిజెంట్‌కు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. లీజు విధానంలో మాత్రమే భూ కేటాయింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)