Breaking News

AP: కేఆర్‌ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ 

Published on Wed, 08/09/2023 - 08:36

సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్ల మేర నష్టం కలిగించారంటూ విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం దా­ఖ­లు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సూర్యనారాయణపై ఉన్నవి మా­మూ­లు ఆరోపణలు కాదని, అవి చాలా తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది.

సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చి చెప్పింది. సూర్యనారాయణ పాత్రపై వ్యాపారులు స్పష్టమైన వాంగ్మూలాలు ఇచ్చారన్న పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత వ్యాపారులు ముందుకొచ్చి వాంగ్మూలాలు ఇచ్చారని, సహ నిందితులు సైతం వాంగ్మూలాలు ఇచ్చారని, పలువురు సాక్షులు కూడా వాంగ్మూలం ఇచ్చారని, వీటన్నింటినీ పరిశీలిస్తే నేరంలో సూర్యనారాయణ పాత్ర ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయంది.
చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు

దర్యాప్తులో పోలీసులు సేకరించిన సాక్ష్యాలు సూర్యనారాయణ పాత్రను ప్రాథమికంగా నిర్ధారిస్తున్నాయని తెలిపింది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినటువంటి తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో సూర్యనారాయణకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో సూర్యనారాయణ పాత్రపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అది ఇంకా పూర్తి కాలేదంది. అందువల్ల ఆయన ముందస్తు బెయిల్‌ పిటి­షన్‌ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)