Breaking News

భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడం ఆపాల్సిందే

Published on Wed, 01/07/2026 - 04:44

సాక్షి, అమరావతి: శ్రీవారి పరకామణిలో చేపట్టే సంస్కరణలపై టీటీడీ సమర్పించిన ప్లాన్‌–ఏపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల్లో తాము పలు అంశాల్లో సంస్కరణలు అవసరమని చెబుతూ సలహాలు, సూచనలు కోరితే.. టీటీడీ మాత్రం ఎలాంటి సలహాలను తెలియజేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. తాము లేవనెత్తిన ఏ అంశానికీ సమాధానం ఇవ్వలేదని తప్పు పట్టింది. శ్రీవారి పరకామణిలో కానుకల లెక్కింపును సేవగా భావించి వచ్చే భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడంపై హైకోర్టు మరోసారి అభ్యంతరం తెలిపింది.

తనిఖీలపై భక్తిరీత్యా భక్తులు అభ్యంతరం చెప్పకపోవచ్చని, కానీ.. ఇది రాజ్యాంగం కల్పించిన ‘గౌరవంగా, హుందాగా జీవించే హక్కు’ను కాలరాయడమేనని స్పష్టం చేసింది. ఈ హక్కును ఎవరూ కాలరాయలేరని తేల్చి చెప్పింది. ఒకవేళ తనిఖీల్ని ఆపకుంటే.. పరకామణిలో భక్తుల చేత కానుకల లెక్కింపును ఆపేస్తూ ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది.

కానుకలు లెక్కించే చోట టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలపైనా టీటీడీ తన నివేదికలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంది. అందువల్ల భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడం, లెక్కింపు కోసం టేబుళ్ల ఏర్పాటుపై స్పష్టత తీసుకుని పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆ అధికారులపై క్రమశిక్షణ చర్యలు అవసరం 
పరకామణిలో రూ.72 వేల విలువైన 900 డాలర్ల చోరీ నేపథ్యంలో హైకోర్టు ఇటీవల పలు సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీకి ఆదేశాలిచ్చింది. పరకామణిలో తక్షణ సంస్కరణల నిమిత్తం ప్లాన్‌–ఏ సమర్పించాలని టీటీడీని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వ్యవహారంపై జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ మరోసారి విచారణ జరిపారు.

టీటీడీ సమరి్పంచిన ప్లాన్‌–ఏను పరిశీలించానని, గత విచారణ సమయంలో తాను లేవనెత్తిన అంశాలు, ఆదేశాల గురించి అందులో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఇది తమను అసంతృప్తికి గురి చేసిందన్నారు. పరకామణిలో చోరీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. నిందితుడు రవికుమార్‌తో కొందరు పోలీసులు కుమ్మక్కైనట్టు సీఐడీ నివేదికను పరిశీలిస్తే తెలిసిందన్నారు. చోరీ కేసు లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్న వ్యవహారంపై తప్ప మిగిలిన అన్ని అంశాల్లో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని, చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చని సీఐడీ, ఏసీబీ అదనపు డీజీలకు న్యాయమూర్తి స్పష్టం చేశారు.   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)