Breaking News

చంద్రబాబుకి మధ్యంతర బెయిల్‌ మంజూరు

Published on Tue, 10/31/2023 - 10:56

సాక్షి, గుంటూరు: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్‌ లభించింది. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది . 

స్కిల్‌ స్కాం కేసులో.. అదీ ఆరోగ్య కారణాల దృష్ట్యా చం‍ద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ క్రమంలో పలు షరతులు విధించింది. ‘‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్‌ గడువు ముగిశాక నవంబర్‌ 28వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ మరుక్షణమే రద్దు అవుతుంది’’అని తీర్పు కాపీలో జస్టిస్‌ మల్లికార్జున రావు స్పష్టం చేశారు.

అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేవలం స్కిల్‌ స్కామ్‌ కేసులో.. అదీ కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి మధ్యంతర బెయిల్‌ మంజూరు అయినట్లు తెలుస్తోంది. అలాగే నవంబర్‌ 10న ఈ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో నేటికి  రిమాండ్‌ ఖైదీగా 52 రోజులు పూర్తి చేసుకున్నారాయన. 

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ కోర్టు కాపీ కోసం క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)