అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
AP: సీనియర్ ఐపీఎస్‌లపై కూటమి సర్కార్ వివక్ష
Published on Wed, 08/14/2024 - 14:40
సాక్షి, అమరావతి: ఏపీలో సీనియర్ ఐపీఎస్‌లపై వివక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతున్నా వారికి మాత్రం ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో, సర్కార్ తీరుపై సీనియర్ ఐపీఎస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కూటమి సర్కార్ సీనియర్ ఐపీఎస్‌లపై వివక్ష చూపిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఐపీఎస్‌లకు పార్టీ రంగు పులిమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాకుండా వారిని ప్రతీరోజూ డీజీపీ ఆఫీస్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోజూ ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీస్‌లో హాజరు వేసుకోవాలని ఆదేశించింది. ఆఫీసర్స్ వెయిటింగ్ రూమ్‌లోనే రోజంతా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. డీజీపీ కూడా ఏదైనా పని అప్పగిస్తే వెంటనే వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ తీరుపై సీనియర్ ఐపీఎస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags : 1