Breaking News

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం

Published on Thu, 07/20/2023 - 16:38

సాక్షి, అమరావతి: వలంటీర్లపై దురద్దేశపూర్వకంగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో ఈ నెల 9న వలంటీర్లపై పవన్‌ నిరాధార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహిళల అక్రమ రవాణా చేస్తున్నారంటూ పవన్‌ వ్యాఖ్యానించారు.

దీనిపై 1973 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంబంధింత కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్లలోని మహిళలను కించపరిచేలా.. అవమానకరమైన, విషపూరిత వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై పవన్‌ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఆత్మీయులకు స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను పవన్‌ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటంపై నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి.
చదవండి: ఓరీ దత్తపుత్రా.. అందుకేనా వాలంటీర్లపై అడ్డగోలు వాగింది!

అవ్వాతాతలు, అక్క­చెల్లెమ్మలు ఆప్యాయంగా పలుకరించే వలంటీర్‌ సోదరులకు దురుద్దేశాలను ఆపాదించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వలంటీర్లుగా దాదాపు 53 శాతం మంది యువతులు సేవలందిస్తుండగా సాటి మహిళలకు వారెందుకు చేటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
చదవండి: అయ్యా జల్సా రాయుడు గారూ.. పవన్‌కు వాలంటీర్ల మరో ఘాటు లేఖ

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)