Breaking News

మొక్కజొన్నకు దక్కని మద్దతు

Published on Sun, 11/23/2025 - 05:52

సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు మద్దతు కరువైంది. అగ్రివాచ్‌తో పాటు వ్యవసాయ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం (ఎఎంఐసీ) ముందస్తు అంచనా ధరల కంటే దిగజారిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కోతలు ప్రారంభమై 45 రోజులు దాటినా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలోచన చేయకపోవడం పట్ల రైతులు మండిపడుతున్నారు. మార్కెట్‌లో మద్దతు ధర దక్కక పోవడంతో వ్యాపారులు, దళారీల చేతిలో నిలువు దోపిడికి గురవుతున్నారు.  

భారీగా తగ్గిన దిగుబడులు 
ఖరీఫ్‌ సీజన్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 3.32 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది సాగు లక్ష్యం 3.62 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. కాగా, లక్ష్యానికి మించి 4.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. నంద్యాల, అనంతపురం, సత్యసాయి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, ప్రకాశం జిల్లాలో అధిక సాగు నమోదయ్యింది.  ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే దిగుబడులు సగటున 25–35 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, అధిక వర్షాల ప్రభావంతో 20–23 క్వింటాళ్లకుమించి రాని పరిస్థితి నెలకొంది. నాణ్యత కూడా పడిపోవడంతో మార్కెట్‌లో మద్దతు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది.   

ధరల అంచనా తారుమారు 
ఖరీఫ్‌ సీజన్‌లో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధరగా క్వింటా రూ.2400గా కేంద్రం ప్రకటించింది. కాగా, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ధరలను అంచనా వేసే మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం (ఎఎంఐసీ) ప్రకటించిన ముందస్తు ధరల అంచనా ప్రకారం కోతలు ప్రారంభమయ్యే సమయానికి ధర రూ.2,335–­2,625 మధ్య పలకాల్సి ఉంది. కానీ, క్షేత్ర స్థాయిలో క్వింటా రూ.1,600 నుంచి రూ.1,900కు మించి పలకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఎకరాకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు రైతులు నష్టపోతున్నారు. అక్టోబర్‌ మొదటి వారం నుంచే కోతలు మొదలయ్యాయి.  

రైతుల గోడు పట్టని చంద్రబాబు 
కోతల సమయంలో అధిక వర్షాలు, ఆ తర్వాత మోంథా తుపాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలు మొక్కజొన్న రైతులను కోలుకోలేని దెబ్బతీసాయి. దీంతో తేమశాతం అధికంగా ఉంటోంది. ఆరుదల కోసం రోజుల తరబడి ఎండలో ఆరబెడుతున్నా ఫలితం లేకుండా పోతుంది.  మొక్కజొన్న విత్తనాలను ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. యార్డులో ఆరబెడుతున్న రైతులు ప్రత్యేకంగా కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ధరలు పతనమైన సమయంలో మార్కెట్‌లో జోక్యం చేసుకొని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే మాకీ తిప్పలు ఉండేవి కావని చెబుతున్నారు. మార్కెట్‌లో కొనేవారు లేకపోవడంతో రైతులు దళారీలను ఆశ్రయించి, నష్టపోవాల్సి వస్తోంది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)