Breaking News

యూరియా అడిగితే పోలీసులతో కొట్టించారు

Published on Fri, 01/30/2026 - 05:47

అత్మకూరు: యూరియా అడిగితే ఇవ్వకుండా టీడీపీ నేతలకు మాత్రమే ఇస్తుండడాన్ని ప్రశ్నించినందుకు ఓ రైతుపై ఆ పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. మూడు రోజులుగా పంపిణీ చేస్తున్నా.. తమకు ఇవ్వడం లేదని ఆ రైతు అడగడమే నేరమన్నట్లుగా తీవ్రంగా కొట్టిందే కాక.. కేసు పెట్టి పోలీసులతోనూ కొట్టించారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురంలో జరిగింది.

తెలుగురాయపురం గ్రామానికి చెందిన రైతులు అల్లంపాటి శ్రీనివాసులురెడ్డి, రాపూరు చినపెంచలరెడ్డి, ఏ వెంకటనరసారెడ్డి  గ్రామంలోని సచివాలయం వద్దకు యూరియా కోసం మూడు రోజుల కిందట వెళ్లారు. అయితే అక్కడ టీడీపీకి చెందిన దేవరాయపల్లి ప్రతాప్‌ అనే వ్యక్తి తమ వారికి మాత్రమే యూరియా ఇప్పించుకుంటున్నాడు. దీనిని ప్రశ్నించిన ఆ ముగ్గురు రైతులపై ఆ టీడీపీ నాయకుడు కలువాయి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించాడు. 

ఎస్‌ఐ బాధిత రైతులను రోజూ రప్పిస్తూ రాత్రి వరకు స్టేషన్‌లో ఉంచుకుని పంపారు. గురువారం ఈవిషయమై  రైతులు ప్రశ్నించడంతో లాఠీలతో  కొట్టారని  బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధను తట్టుకోలేక నేరుగా ఆత్మకూరు కోర్టుకు వచ్చి జడ్జికి తమకు జరిగిన అన్యాయంపై వివరించారు. దీంతో జడ్జి..  ముందు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని న్యాయవాదిని పురమాయించి వైద్యశాలకు పంపారు. దీంతో ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఆ ముగ్గురు రైతులు చికిత్స పొందుతున్నారు.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)