Breaking News

మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?

Published on Thu, 04/27/2023 - 19:21

సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలపై చర్చించామని, టైమ్‌లైన్‌ ప్రకారం ప్రతి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది.

అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, ఒక్కొక్క జీవోను వరుసగా విడుదల చేస్తామని, ఉద్యోగుల బకాయిల్లో 70 శాతం చెల్లించాం.. సీపీఎస్‌పై మరోసారి చర్చిస్తామని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్చించాం.. దాని అమలుకు స్పష్టమైన  విధివిధానాలను రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

హెల్త్‌కార్డుల కంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు మళ్లించాలని నిర్ణయించాం: వెంకట్రామిరెడ్డి
‘‘ఉద్యోగుల పెండింగ్‌ బకాయిల్లో రూ.5,820 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. పెండింగ్‌ డీఏలలో ఒక డీఏను చెల్లిస్తామని చెప్పారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి అన్నారు.

సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వారం రోజుల్లో ఒక​ డీఏ ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరాం. 2004కు ముందు నోటిఫికేషన్‌లో భర్తీ అయిన వారికి ఓపీఎస్‌ పరిధిలోకి తెస్తామన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి టైమ్‌లైన్‌ కోవాలని కోరాం. సెప్టెంబర్‌ లోపు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఉత్తర్వులు ఇస్తామన్నారు. కొత్త పీఆర్‌సీని నియమించాలని కోరాం. ఉద్యోగుల హెల్త్‌కార్డుల కంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు మళ్లించాలని నిర్ణయించాం’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.
చదవండి: ‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)