ఓడినా.. గెలిచినా మీతోనే జగన్‌

Published on Wed, 06/05/2024 - 05:44

సాక్షి, అమరావతి: ఏం జరిగిందో.. ఎలా జరిగిందో కూటమి గెలిచింది. వైఎస్సార్‌సీపీ అత్యల్ప స్థానా­లనే దక్కించుకుంది. అయితేనేం ఆ పార్టీ క్యాడర్‌లో ఇసుమంత ఆత్మస్థైర్యం కూడా సడలలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమా­నం కించిత్తయినా తగ్గలేదు. వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, జగన్‌ మరోసారి ముఖ్య­మంత్రి అవుతారని కోటి ఆశలతో రేయింబవళ్లు శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు మంగళవారం ఓట్ల లెక్కింపు మొదలైన కొద్దిసేపటికే అర్థమైపో­యింది. అయినా ఏ మాత్రం సంయమనం కోల్పో­లేదు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్దకు వచ్చి టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలతో కవ్వింపు చర్యలకు పాల్పడినా చలించలేదు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి, అధినేత జగన్‌ ఆదేశం కోసం సాయంత్రం వరకూ ఎదురుచూశారు. సాయంత్రం మీడి­యాతో ఆయన మాట్లాడాక వారిలో కొండంత ధైర్యం వచ్చింది. ‘ఓడినా.. గెలిచినా ప్రాణం ఉన్నంతవరకూ మా ప్రయాణం నీతోనే జగనన్న’ అంటూ ముక్తకంఠంలో వారు చేసిన నినాదం సోషల్‌ మీడియాలో మిన్నంటింది. వాట్సప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌ గ్రూపుల్లో జగన్‌కు అనుకూలంగా పోస్టులు వెల్లువెత్తాయి.

ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకుండా జగన్, వైఎస్సార్‌సీపీకి అభిమా­నులు మద్దతు ప్రకటించారు. తమకు పదవులతో పనిలేదని, కడవరకూ మీ వెంటే మేమంతా ఉంటామని కామెంట్లు పెట్టారు. కొందరు ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేశారు. మరికొందరు పార్టీ సంస్థాగత నిర్మాణంలో లోటుపాట్లపై సూచనలు, సలహాలు ఇచ్చారు. సీఎం జగన్‌ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన మాటలకు కన్నీళ్లు ఆగడం లేదంటూ ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల గుండెల్లో జగన్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఈ చర్యలతో స్పష్టమైంది. మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ వారంతా అండగా నిలవడాన్ని బట్టి సీఎం జగన్‌ జనం మనసులను గెలుచుకున్నారని రుజువైంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)