Breaking News

ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల

Published on Thu, 07/02/2026 - 05:35

సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌–2026 ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో విడుదల చేశారు. అలాగే సెట్‌ చైర్మన్, యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సెట్‌ కన్వీనర్‌ ఎన్‌.మోహనరావు కూడా కాకినాడ జేఎన్‌టీయూలో ఈ ఫలితాలను వెల్లడించారు. జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో మే 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 2,76,572 మంది దరఖాస్తు చేసుకోగా, 2,58,545 మంది పరీక్షలకు హాజరయ్యారు, వీరిలో 1,82,317 మంది (70.52%) అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా, 70,929 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 63,546 మంది (89.59%) అర్హత సాధించారు. కాగా, ఇంజినీరింగ్‌లో గుంజూరు జిల్లా తాడేపల్లికి చెందిన జొన్నల రోషన్‌ మణిదీప్‌ రెడ్డి మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. అలాగే, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగంలో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన శంబంగి జశ్వంత్‌ నాయుడు టాపర్‌గా నిలిచాడు. ఫలితాలను https://cets. apsche.ap. gov.in/ EAPCETలో చూడవచ్చు.

ఇంజినీరింగ్‌ అండ్‌ ఫార్మసీ టాప్‌ ర్యాంక్స్‌ ఇవే..  
1. జొన్నల రోషన్‌ మణిదీప్‌ రెడ్డి (గుంటూరు జిల్లా) 
2. కోరుకొండ శ్రావ్య  (శ్రీకాకుళం) 
3. వెన్న ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి (పల్నాడు) 
అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ టాపర్లు వీరే.. 
1. శంబంగి జశ్వంత్‌ నాయుడు (విజయనగరం) 
2. అక్షజ్‌ రెడ్డి (మేడ్చల్‌ మల్కాజిగిరి) 
3. హారికాదేవి శ్రీ అనూహ్య (కృష్ణా)  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)