Breaking News

చెరువును చెరబట్టి.. పరిహారం కొల్లగొట్టి

Published on Wed, 07/08/2026 - 02:52

సాక్షి, అమరావతి: రాజధానిని బాబు సర్కారు భూ కుంభకోణాల నిలయంగా మార్చిందనేందుకు మరో తార్కాణమిది! చెరువును ఆక్రమించి కట్టిన భవనాలకు పరిహారంతోపాటు విలువైన ప్లాట్లను బహుమానంగా ఇవ్వడం బరితెగింపునకు పరాకాష్టగా మారింది. 

కేంద్ర మంత్రి అండదండలతో... 
రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు చెరువును ఆక్రమించి నిర్మించుకున్న ప్రైవేట్‌ కాలేజీకి చెందిన రెండు భవనాలను ఎన్‌–14 రోడ్డు నిర్మాణంలో భాగంగా తొలగించాల్సి రావడంతో సీఆర్‌డీఏ అధికారులు వాటిని భూ సమీకరణ కింద తీసుకున్నారు. ఆ కాలేజీని నిర్వహిస్తున్న తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ గద్దె మంగయ్యకు రైతులకు ఇస్తున్న దానికంటే అధిక పరిమాణంతో కూడిన వాణిజ్య, నివాస ప్లాట్లు కేటాయించింది. కాలేజీ భవనాలకు సీఆర్‌డీఏ రూ.1.40 కోట్ల మేర పరిహారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అంతటితో ఆగకుండా.. చెరువును ఆక్రమించి కట్టిన ఆ ప్రైవేట్‌ కాలేజీ భవనాలకు సమీపంలోనే యాజమాన్యానికి 3.10 ఎకరాల భూమి ఉందంటూ తహసీల్దార్‌ జారీ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్‌ సృష్టించారని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ఆ నకిలీ సర్టిఫికెట్‌ను అడ్డుపెట్టుకుని తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీకి రాజధాని ప్రధాన ప్రాంతంలోని రాయపూడి వద్ద సర్వే నెంబరు 204, 205లో మూడు ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించడంపై తుళ్లూరు మండలం టీడీపీలోని ఓ వర్గం నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ముసుగులోని టీడీపీ నేతలకు ఓ కేంద్ర మంత్రి దన్నుగా నిలిచి.. భూమి కేటాయించేలా ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారని చెబుతున్నారు. రాజధానిలో టీడీపీ నేతలు ఏ స్థాయిలో భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారో చెప్పేందుకు ఇది మచ్చు తునక అని పరిశీలకులు పేర్కొంటున్నారు. చెరువులు.. కుంటలు.. వాగులు, వంకలు లాంటి జలవనరులను ఆక్రమించడం నేరమని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో హెచ్చరిస్తూ తీర్పులు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు బరితెగించారని న్యాయనిపుణులు మండిపడుతున్నారు. 

చెరువును ఆక్రమించి కట్టిన రెండు కాలేజీ భవనాలకు సమీపంలో 3.10 ఎకరాలు భవిష్యత్తు అవసరాల కోసం అందుబాటులో ఉన్నదని తుళ్లూరు తహసీల్దార్‌ టీడీపీ నేతలు  సష్టించిన నకిలీ సర్టిఫికెట్‌ 

తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ గద్దె మంగయ్యకు ఇచ్చిన 2070 గజాల ప్లాట్‌ వివరాలు 

60 సెంట్లు ఆక్రమణ.. రెండుసార్లు పరిహారం 
» తుళ్లూరులో సర్వే నంబరు 78లో చెరువు 23.80 ఎకరాలలో విస్తరించి ఉందని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఐదు దశాబ్దాల క్రితం అక్కడ కేవీఆర్‌ జెడ్పీ హైసూ్కల్‌ ఏర్పాటైంది. 1992లో టీడీపీ నేతలు గద్దె మంగయ్య, జొన్నలగడ్డ శంకరరావు, భద్రయ్య ఆ స్కూల్లో రెండు షెడ్లు లీజుకు తీసుకుని తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుతో ఎస్‌ఆర్‌వీఎస్‌అండ్‌ఎన్‌ఎస్‌ఆర్‌ కాలేజీ ప్రారంభించారు. కొన్నా ళ్ల తర్వాత జెడ్పీ హైస్కూల్‌ వెనుక ఉన్న చెరువు భూమి 60 సెంట్లు ఆక్రమించి.. షెడ్లతోపాటు కొన్ని భవనాలు నిర్మించి ప్రైవేట్‌ కాలేజీ నడుపుతున్నారు.  

»  2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రకటన తర్వాత ఎన్‌–14 రోడ్డు ఆ కాలేజీ మధ్య నుంచి వెళ్తుండటంతో తొలగించాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. చెరువు భూమిని ఆక్రమించి కాలేజీని నిర్మించారని తెలిసినా ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి ఆ భూమిని భూ సమీకరణ కింద తీసుకున్నారు.  

»  భూ సమీకరణ కింద రైతుల నుంచి మెట్ట భూమి ఎకరం తీసుకుంటే ఏటా కౌలుతోపాటు వెయ్యి గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాటు.. అదే జరీబు భూమి ఎకరానికి కౌలుతోపాటు వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు కేటాయిస్తారు. అయితే ఆక్రమించిన 60 సెంట్ల చెరువు భూమికి సాధారణ రైతులకు ఇచ్చే పరిమాణం కంటే అధిక విస్తీర్ణంతో కూడిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఆ సొసైటీ ప్రెసిడెంట్‌ గద్దె మంగయ్యకు కేటాయించారు. గద్దె మంగయ్యకు 2,070 గజాల విస్తీర్ణంతో కూడిన నివాస, 500 గజాల వాణిజ్య ప్లాటును కేటాయించారు. అంతేకాకుండా ఆ కాలేజీ భవనాలకుగా ను రూ.1.40 కోట్ల మేర సీఆర్‌డీఏ పరిహారం కూడా చెల్లించిందని రాజధాని రైతులు చెబుతున్నారు.

నకిలీ సర్టిఫికెట్‌ సృష్టించి.. అప్పనంగా 3 ఎకరాలు!  
ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2024లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఎన్‌–14 రోడ్డుతో కోల్పో తున్న కాలేజీ భూమికి పరిహారంగా భూమిని కాజేసేందుకు తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీ పావులు కదపడం మరొక ఎత్తు. ప్రైవేటు కాలేజీ కోసం చెరువును ఆక్రమించి నిర్మించిన రెండు భవనాలను తుళ్లూరు తహసీల్దార్‌ తనిఖీ చేసినట్లు.. 1996–97 విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు ఆ భవనాలు సిద్ధంగా ఉన్నట్లు.. భవిష్యత్‌ అవసరాల కోసం సమీపంలోనే 3.10 ఎకరాల భూమీ అందుబాటులో ఉన్నట్లుగా నకిలీ సర్టిఫికెట్‌ సృష్టించారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 

సర్టిఫికెట్‌లో ఆ భవనాలను తనిఖీ చేసిన తేదీగానీ.. తహసీల్దార్‌ సంతకంగానీ లేదు. ఆ నకిలీ సర్టిఫికెట్‌ను చూపుతూ.. ఎన్‌–14 రోడ్డు నిర్మాణం వల్ల కాలేజీ భవనాలతోపాటు తాము 3.10 ఎకరాల భూమి కోల్పోయామని, ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించాలని తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ముసుగులో టీడీపీ నేతలు సీఆర్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఓ కేంద్ర మంత్రి వారికి దన్నుగా నిలిచి ఉన్నత స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. 

తలొగ్గిన అధికారులు 3 ఎకరాలు కేటాయించాలని మంత్రివర్గానికి ప్రతిపాదనలు పంపారు. వాటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో సచివాలయం శాశ్వత భవనాలు నిర్మిస్తున్న అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌(ఏజీసీ)కి అత్యంత సమీపంలో ‘తుళ్లూరు ఎడ్యుకేషనల్‌ సొసైటీ’కి 3 ఎకరాల భూమిని కేటాయిస్తూ మార్చి 16న చంద్ర బాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)