ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు

Published on Wed, 10/01/2025 - 15:03

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రైలు, రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని.. ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, యానాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

రానున్న మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు పడనున్నాయని.. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రా గల 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం,   అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. చెట్ల కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

AP Rains: ఉత్తర కోస్తాకు అతిభారీ వర్ష సూచన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)