Breaking News

విశాఖలో విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్‌

Published on Fri, 08/29/2025 - 04:04

మధురవాడ (విశాఖ జిల్లా): మాట వినలేదని ఓ విద్యార్థి చేయిని టీచర్‌ విరగ్గొట్టిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలు­గులోకి వచ్చింది. మధురవాడ ఆదిత్యనగర్‌లో ఉన్న శ్రీ తనుష్‌ ప్రైవేట్‌ స్కూల్‌లో మధురవాడకు చెందిన నరేష్‌ (13) ఎనిమిదో తరగతి చదువుతు­న్నాడు. మంగళవారం క్లాసులో ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన సోషల్‌ టీచర్‌ మోహన్‌..కోపంతో నరేష్‌ను కొట్టి, షర్ట్‌ పట్టుకుని గట్టిగా తోశాడు. దీంతో బాధిత విద్యార్థి ఇనుప బెంచీపై పడడంతో చెయ్యి విరిగింది. అంతటితో ఆ టీచర్‌ ఆగకుండా.. అక్కడే మోకాళ్లపై నరేష్‌ను కూర్చోబెట్టి అమానుషంగా ప్రవర్తించాడు.

ఇంటికి వెళ్లి విద్యార్థి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పగా..వారు వైద్యం నిమిత్తం నరేష్‌ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. టీచర్‌ మోహన్‌ పరారీలో ఉన్నాడు. బుధవారం వినా­యక చవితి సందర్భంగా సెలవు కావ­డంతో, గురువారం పాఠశాలకు చేరుకున్న తండ్రి ఆదినారాయణ ఇతర కుటుంబ సభ్యులు స్కూల్‌ వద్ద ఆందోళన చేపట్టారు. తమ బిడ్డకు న్యాయం చేయకపోతే ఊరుకు­నేది లేదంటూ నినదించారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయుల అసోసి­యే­షన్‌ ప్రతినిధులు స్కూల్‌ యాజమా­న్యానికి వంత పాడటం గమనార్హం. ఘటనా­స్థలికి మండల విద్యాశాఖ అధికారి అనురాధ, పీఎంపాలెం పోలీసుస్టేషన్‌ ఎస్‌ఐ సునీత చేరుకుని విచారణ చేట్టారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి