Breaking News

తడికలపూడి టు ఫ్రాన్స్‌ 

Published on Tue, 07/18/2023 - 05:04

సాక్షి, అమరావతి: కోకో పంటకు ప్రపంచస్థాయి బ్రాండింగ్‌ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు స్థానికంగా మాత్రమే కోకో గింజలను విక్రయిస్తున్న రైతుల ద్వారా ఫైన్‌ ఫ్లేవర్డ్‌ కోకో గింజల్ని ఉత్పత్తి చేసి వాటిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఉత్పత్తి చేసిన ప్రీమియం కోకో గింజలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేయడంతో ఇదే స్ఫూర్తితో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు చేయూతనివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.

కోకో సాగు, ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఏపీలో సాగు విస్తీర్ణం నాలుగేళ్లలో 21వేల హెక్టార్ల నుంచి 39,714 హెక్టార్లకు విస్తరించింది. తద్వారా 10,903 టన్నుల కోకో గింజలు ఉత్పత్తి వస్తుండగా దిగుబడిలో 80 శాతం క్యాడ్బరీ, మిగిలింది నెస్ట్‌లే, క్యాంప్కో వంటి కంపెనీలు సేకరిస్తున్నాయి. 

అదనపు ధర కల్పించడమే లక్ష్యంగా.. 
రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడమే ల­క్ష్యం­గా ఏలూరులో రూ.75 కోట్లతో కోకోవా, వెనీ­లా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుచేస్తున్న ప్రభు­త్వం మరోవైపు గింజల్ని  ఫర్మెంటేషన్‌ చేయడం ద్వారా నేరుగా విదేశాలకు ఎగుమ­తి చేసుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. శాస్త్రీయ పద్ధతిలో ఫర్మెంటేషన్‌ వల్ల ప్రీమి­యం చాక్లెట్స్‌ తయారీకి అవసరమైన ఫ్లేవర్‌ కోకో గిం­జలకు వస్తుంది.

వీటికి మార్కెట్‌ ధర కంటే 30% అదనంగా చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. సేంద్రియ ప­ద­్ధతి­లో సాగు, శాస్త్రీ­య పద్ధతిలో ఫర్మెంటేషన్‌ చేస్తే మరో 15% అదనంగా చెల్లిస్తామంటున్నాయి. ప్రీమియం చాక్లెట్స్‌ తయారీలో ఉపయోగించే ఫైన్‌ ఫ్లేవర్డ్‌ గింజల  ఉత్పత్తే లక్ష్యంగా ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ద్వారా ప్రభుత్వం 35% సబ్సిడీపై రూ.28 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది.

గోదావరి కోకోకు గ్లోబల్‌ బ్రాండింగ్‌ 
గోదావరి కోకోకు గ్లోబల్‌ బ్రాండింగ్‌ కల్పించడమే లక్ష్యంగా ముందుకొచ్చే రైతులు, ఎఫ్‌పీఓలకు సబ్సిడీపై ఆర్ధిక చేయూతనిస్తున్నాం. పైలట్‌ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ కావడంతో మరింత­మంది రైతుల ద్వారా ప్రీమియం కోకో గింజలను ఉత్పత్తి చేసి నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 
– చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)