Breaking News

ప్రపంచ చోదక శక్తి యువతే 

Published on Sun, 09/17/2023 - 04:37

సాక్షి, అమరావతి: ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ)లో జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సదస్సుకు వెళ్లిన మన రాష్ట్ర విద్యార్థులు శనివారం జనరల్‌ అసెంబ్లీలో జరిగిన సదస్సులో ప్రసంగించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఎస్‌డీజీ యాక్షన్‌ వీకెండ్‌ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ గళం వినిపించారు.

వివిధ దేశాల అధినేతలు, కేంద్ర మంత్రులు, యూఎన్‌ మెంబర్స్‌ పాల్గొన్న ఈ సదస్సులో తొలిరోజు దడాల జ్యోత్స్న, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరి చంద్రలేఖ, షేక్‌ అమ్మాజాన్, వంజివాకు యోగేశ్వర్‌ మాట్లాడారు. 2030 నాటికి భవిష్యత్‌ తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించాలన్న నినాదంతో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులు సుస్థిరాభివృద్ధిలో యువత ప్రాధా­న్యం చాలా అవసరమని, అభివృద్ధికి యువత టార్చ్‌ బేరర్‌గా బాధ్యత తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న 1.9 బిలియన్ల మంది యువత ప్రపంచ చోదక శక్తిగా మారాలని, సానుకూల సామాజిక మార్పుకు దిక్సూచిగా ఉండాలని అంతర్జాతీయ ప్రతినిధుల ముందు చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు, ప్రపంచాన్ని తిరిగి సరైన మార్గంలో నడిపించేందుకు యువత కృతనిశ్చయంగా ఉండాలన్నారు. తొలిసారి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తొలిరోజు సదస్సులో ఐక్యరాజ్య స­మితి స్పెషల్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ షకిన్‌కుమా­ర్, సమగ్ర శిక్ష ఏపీ ఎస్పీడీ శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, ఉత్తర అమెరికా రా­ష్ట్ర ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ పాల్గొన్నారు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)