తిరగబడ్డ విద్యార్థి లోకం

Published on Tue, 04/22/2025 - 05:45

సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్‌: కూటమి ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు సోమవారం కదంతొక్కారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు రోడ్లపై ఎక్కడికక్కడ నిర్బంధించే ప్రయ­త్నం చేయగా.. విద్యార్థులు వాటిని దాటుకొని ముందుకు కదిలారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పినప్పటికీ.. విద్యార్థులు, నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు అక్కడ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వినతిపత్రం ఇచ్చేందుకు సైతం విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఓ విద్యార్థి చేతిని గేటు మధ్యలో పెట్టి లోపల ఉన్న పోలీసులు నొక్కడంతో.. ఆ విద్యార్థి బాధతో విలవిలలాడాడు. చివరకు తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు ఐదుగురు నాయకులను లోపలకు అనుమతించారు.

వారు సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నాలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.రవిచంద్ర, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్‌ రెడ్డి, కె.శివారెడ్డి, గోలి నరసింహ, గోపి కృష్ణ, వినోద్, కోమల్‌ సాయి, ఐ.శ్రీనివాస్, కొండల్‌ రావు, సందీప్, గోపీచంద్, నారాయణ, పూజిత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)