Breaking News

యువతిపై దాడి కేసు.. ప్రేమోన్మాది గణేష్‌ అరెస్ట్‌

Published on Sat, 02/15/2025 - 14:50

సాక్షి,అన్నమయ్య జిల్లా: పీలేరులో యువతిపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది గణేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యా సాగర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ‘ఇంటర్,డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి గణేష్ ,గౌతమి ఒకే కాలేజీలో చదువుకున్నారు. గౌతమిని ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. చదువు పూర్తి అయ్యాక గౌతమి బ్యూటీషియన్‌గా మదనపల్లి బ్యూటీ పార్లర్‌లో పనిచేసేది. అప్పుడు కూడా గణేష్ ఆమె వెంటపడేవాడు.

ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్‌తో  వివాహం నిశ్చయించారు. ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరిపేందుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉంటున్న ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవపడ్డాడు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో  గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు, అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్‌ ఆమె నోటిలో పోశాడు.

తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. ఈ కేసులో నిందితుడైన గణేష్‌ను శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. బాలికలు యువతులు మహిళలను  ఎవరైనా వేధిస్తే సహించేది లేదు. వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలి’అని ఎస్పీ కోరారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)