Breaking News

జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు ఎప్పటిలోగా చెల్లిస్తారు?

Published on Tue, 01/20/2026 - 04:12

సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ కడప జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం, రవాణా భత్యం, కరువు భత్యం వంటి బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టంగా చెప్పాలని జెడ్పీ సీఈవోను హైకోర్టు నిలదీసింది. ఒక్కో సభ్యునికి రూ.2.10 లక్షల చొప్పున బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీటిని చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కడప జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల చెన్న­య్య, మరో 26 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి సోమవారం మరోసారి విచారణ జరిపారు.

ఈ నేపథ్యంలో జెడ్పీ సీఈవో ఓ మెమోను కోర్టు ముందుంచారు. ఆ వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లింపు విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఈవోను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు సకాలంలో వేతనాలు అందుతున్నాయన్నారు. కానీ పిటిషనర్లకు మా­త్ర­ం గౌరవ వేతనం, ఇతర భత్యా­లను చెల్లించ­డం లేదని, ఈ విషయంలో నిర్ధిష్ట గడువు విధించాలని కోర్టును అభ్యర్థించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)