Breaking News

ఇక మీ తమాషాలు చాలు

Published on Tue, 12/31/2024 - 05:08

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరుల అక్రమ నిర్బంధం విషయంలో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ‘అక్రమ నిర్బంధాల విషయంలో వాస­్తవాలను రూఢీ చేసుకునేందుకు ఆయా పోలీస్‌­స్టేషన్‌లలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను సమర్పించాలని మేం ఎప్పుడు ఆదేశించినా పోలీసులు ఏవో కుంటిసాకులు చెబుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ సమర్పించకుండా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తమాషాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం. లేనిపక్షంలో ఇలాంటి తమాషాలు కొనసాగుతూనే ఉంటాయి.’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సీసీటీవీ ఫుటేజీని తమ ముందు ఉంచాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా, సీసీటీవీ కాలిపోయిందని, ఫుటేజీ లేదంటూ అఫిడవిట్‌ దాఖలు చేసిన పల్నాడు జిల్లా మాచవరం పోలీస్‌­స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)పై హైకోర్టు మండిపడింది.

అతనిపై తక్షణమే క్రమశిక్ష­ణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే తమ ముందున్న వ్యాజ్యాల్లో అతన్ని సుమోటోగా ప్రతివాదిగా చేర్చి, కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పింది. ఈ వ్యవహారంలో పోలీసులపై ఏం చర్యలు తీసుకోవాలో స్పష్టత­నివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం సోమ­వారం ఉత్తర్వులు జారీచేసింది.

సీసీటీవీ ఫుటేజీ సమర్పణకు హైకోర్టు ఆదేశం...
తన సోదరుడు కటారి గోపీరాజును పోలీసులు అక్ర మంగా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరు తూ కటారు నాగరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన సోదరుడిని నవంబర్‌ 3న అక్రమంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, 7వ తేదీన అరెస్ట్‌ చేశామంటూ అబద్ధం చెబుతున్నారని, ఈ నేపథ్యంలో మాచవరం పోలీస్‌స్టేషన్‌లో నవంబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కూడా ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. నాగరాజు పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాస­నం, నంబవర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని పెన్‌డ్రైవ్‌లో సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా స్పష్టం చేసింది.

కాలిపోయింది.. ఫుటేజీ లేదు...
తాజాగా సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మాచ­వరం ఎస్‌హెచ్‌వో దాఖలు చేసిన కౌంటర్‌ను ధర్మాసనం పరిశీలించింది. తమ స్టేషన్‌లో యూపీ­ఎస్‌తో సహా సీసీటీవీ మొత్తం కాలిపో­యిందని, అందువల్ల ఫుటేజీ రికార్డ్‌ కాలేదని, దీంతో ఫుటేజీని కోర్టు ముందుంచలేకపో­తున్నా­మని ఎస్‌హెచ్‌వో చెప్పడాన్ని తప్పుప­ట్టింది. ‘కోర్టు సీసీటీవీ ఫుటేజీని అడగ్గానే మిస్టీరి­యస్‌గా ఆ సీసీటీవీ ఫుటేజీ కనిపించకుండా పో­తోంది. మీరు (పోలీసులు) చెబుతున్నంత సింపుల్‌ వ్యవహారం కాదిది. మేం కఠినంగా స్పందించకుంటే ఈ తమాషా ఆగేలా కనిపించడం లేదు.

ఎస్‌హెచ్‌వోపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. లేదా మా ఆదేశాల మే­రకు సీసీటీవీ పుటేజీని కోర్టుకు సమర్పించనందుకు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేప­ట్టాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీస్‌­స్టేష­న్‌­లలో సీసీటీవీలను సక్రమంగా నిర్వహించా­ల్సి­న బాధ్యత ఎస్‌హెచ్‌వోపై ఉంది. సీసీటీవీ పని చేయకుంటే దానిని రిపేర్‌ చేయించాల్సిన బాద్యూత కూడా అతనిపైనే ఉంది. ఎస్‌హెచ్‌­వోపై ఎందుకు చర్యలకు ఆదేశించరాదో చెప్పండి..’ అని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)