Breaking News

ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా ఉంది

Published on Tue, 02/24/2026 - 06:03

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ యూజీసీ స్కేల్‌ పొందుతున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసును 62 నుంచి 65కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయసు 65కి పెంచకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ చర్యలు  వివక్షాపూరితమని స్పష్టం చేసింది.

 ప్రభుత్వంలో ఎక్కడో ఏదో తేడా ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు, ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) కూర్చొని ఒకరిద్దరు అధికారులే అన్నీ నిర్ణయాలు తీసేసుకుంటున్నారని సూచించింది. మనది ప్రజాస్వామ్య దేశమే తప్ప, నియంతృత్వ దేశం కాదని, ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఎలా పడితే అలా, ఏది పడితే అది చేయడానికి వీల్లేదంది. ఈ అంశంపై దాఖలైన అప్పీళ్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ సుబేంధు శమం ధర్మాసనం సోమవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

బోధనా సిబ్బంది కొనసాగింపునకు ఆదేశాలు.. 
వ్యవసాయ శాఖ పరిధిలోని ఉద్యానవన, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేల్‌ పొందుతున్న బోధనా సిబ్బందిని తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు తాజాగా ఆదేశించింది. పదవీ విరమణ వయసును 65కి పెంచాలంటూ ఈ నాలుగు విశ్వవిద్యాలయాలు చేసిన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడిత రాజశేఖర్‌ ఏకపక్షంగా తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు రాజశేఖర్‌  ఇచి్చన లేఖ అమలును నిలిపేసింది. 

వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే పలువురు పదవీ విరమణ చేశారని, అయితే ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఇలా అయితే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశి్నంచింది.  పదవీ విరమణ వయసు పెంపుపై కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వానికి మూడు వారాల గడువునిచ్చింది. కాగా ఈ అంశంపై ధర్మాసనం ఆదేశాల మేరకు బుడిద  రాజశేఖర్‌ కోర్టు ముందు స్వయంగా హాజరయ్యారు.  

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)