Breaking News

ఔను.. గత ప్రభుత్వంలోనే జీఎస్టీ మెరుపులు

Published on Tue, 06/03/2025 - 03:33

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసిన జీఎస్టీ ఆ తర్వాత గణనీయంగా పడిపోయిందని స్టేట్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ ఎ.బాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో గణాంకాలతో సహా వివరించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.25,331.43 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ వసూళ్లు.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.44,298.36 కోట్లకు పెరిగాయి.

అంటే కోవిడ్‌ వంటి మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయినా గడచిన ఐదేళ్లలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం అదనంగా రూ.18,966.57 కోట్లు పెరిగింది. అంటే ఏటా సగటున 14.97 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. కోవిడ్‌ తర్వాత వరుసగా మూడేళ్లు రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2021–22లో 25 శాతం, 2022–23లో 23 శాతం, 2024–25లో 10.1 శాతం వృద్ధి నమోదైనట్టు ఎ.బాబు వివరించారు.  

కూటమి ప్రభుత్వం వచ్చాక.. 
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం నేలచూపులు చూస్తోందని.. 2024–25లో రాష్ట్ర స్థూల జీఎస్టీ ఆదాయం కేవలం 1.2 శాతం వృద్ధితో రూ.44,824.51 కోట్లకే పరిమితమైందని ఎ.బాబు పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుత కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఏప్రిల్‌ నెలలో జీఎస్టీ ఆదాయం 3.36 శాతం తగ్గి రూ.4,686 కోట్లకు, మే నెలలో 2.24 శాతం తగ్గి రూ.3,803 కోట్లకు పరిమితమైందని పేర్కొన్నారు. ఒకపక్క జీఎస్టీ ఆదాయం పడిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నా.. కిందపడ్డా మాదే పైచేయి అన్న చందంగా రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయంటూ పత్రికా ప్రకటన ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

గత ప్రభుత్వం హయాంలో రెండంకెల వృద్ధి రేటు నమోదవడానికి కోవిడ్‌ కారణంగా రిటర్న్‌లు దాఖలు చేయడానికి వ్యాపారులకు గడువు పెంచరాదని, దీంతో భారీ వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. 2024–25లో ఆమ్నెస్టీ స్కీం అమలు చేయడం, జీఎస్టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ లేకపోవడం కారణమని పేర్కొన్నారు. 2017–18 నుంచి 2019–20 వరకు లేవనెత్తిన డిమాండ్లపై వడ్డీని మాఫీ చేస్తూ పాత బకాయిలు చెల్లించడానికి అనుమతించడం ద్వారా అదనపు ఆదాయం రావడం, ఆమ్నెస్టీ స్కీం అమలు చేయడం వల్లే 2024–25లో 1.2 శాతం వృద్ధి నమోదైందని జీఎస్టీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

జగన్ హయాంలో GST మెరుపులు, చంద్రబాబు అట్టర్ ప్లాప్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)