Breaking News

రూ.46 కోట్లతో వైఎస్సార్‌ విత్తన పరిశోధన కేంద్రం

Published on Sat, 03/25/2023 - 09:02

సాక్షి,గన్నవరం: రాష్ట్రంలో మొదటిసారిగా రూ.46 కోట్లు వ్యయంతో కృష్ణాజిల్లా గన్నవరంలోని ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆవరణలో నిర్మిస్తున్న వైఎస్సార్‌ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆర్‌కే  రోజా, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, సింహాద్రి రమేష్‌బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమిపూజ చేసి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ ఇప్పటివరకు విత్తన పరిశోధన కేంద్రం జాతీయస్థాయిలో వారణాసిలో మాత్రమే ఉందన్నారు.

తొలిసారిగా రాష్ట్రంలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించడం రైతుల సంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఎనిమిదెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ కేంద్రాన్ని ఏడాదిలోపు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మంత్రి రోజా మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన, అన్ని వాతావరణాలను తట్టకుని మంచి దిగుబడులిచ్చే విత్తనాలను సరఫరా చేసే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.వి.ఎస్‌.­నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శేఖర్‌బాబు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టుకూరి చిరంజీవిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ జె.రాఘవరావు, ఏఎంసీ చైర్మన్‌ రామిశెట్టి అంజనీకుమారి, ఎంపీపీ అనగాని రవి తదితరులు పాల్గొన్నారు.

Videos

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)