Breaking News

ప్రశాంత విశాఖ..

Published on Tue, 07/04/2023 - 04:23

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో శాంతి­భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కీల­క నిర్ణయం తీసుకుంది. ప్రశాంత విశాఖే లక్ష్యంగా అసాంఘిక శక్తుల ఆట­కట్టిం­చేందుకు సిద్ధమైంది. విశాఖను టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి విస్త­రిం­చింది. విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌­నంతా టాస్క్‌ ఫోర్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి­లోకి తెచ్చింది. ఈ మేరకు హోం శాఖ సోమవారం ఉత్త­ర్వులిచ్చింది. ఉత్తర్వులు మే 24 నుంచి అమల్లోకొచ్చినట్టుగా  పరిగణిస్తున్నట్టు కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విశాఖపట్నంలో ఇటీవల ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, వైఎస్సార్‌సీపీ నేత, బిల్డర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్‌ ఉదంతం కలకలం సృష్టించింది. మరో బిల్డర్‌ కిడ్నాప్‌ కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. మరోవైపు అరకు జిల్లా పరిధిలో గంజాయి సాగును ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసినా.. ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని భావించింది. 

అసాంఘిక శక్తులపై కేసులు నమోదుచేయనున్న టాస్క్‌ఫోర్స్‌
ఇప్పటివరకు ఏ ప్రాంతంలోని కేసులను అక్కడి పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కేసుల దర్యాప్తు, విచారణ, శిక్షలు పడేలా చేయడం మొదలైన ప్రక్రియలో కొంత సమన్వయలోపం కనిపిస్తోంది. ఇక నుంచి విశాఖలో ఏ ప్రాంతంలో అసాంఘిక శక్తులపైన అయినా సరే టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడింది.

రౌడీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడి బాధ్యత టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చేపడతారు. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులు, గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, ఈవ్‌ టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడేవారు... ఇలా అన్ని తరహా కేసులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చేపడతారు. అందుకోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు అదనపు అధికారులు, సిబ్బదిని కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)