Breaking News

ఎంఎస్‌ఎంఈలకు బంపర్‌ ఆఫర్‌

Published on Sun, 07/23/2023 - 04:12

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార నిర్వహణలో ఈ సంస్థలు ఎదుర్కొనే ఆర్థిక కష్టాలను తగ్గించి తక్కువ పెట్టుబడితో వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ (ఎఫ్‌ఎఫ్‌సీ)లను ఏర్పాటుచేయనుంది.

ఇందులో భాగంగా.. కనీసం మూడు నుంచి ఐదెకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి అక్కడే ఉమ్మడి సౌకర్యాలతో రెడీ టు వర్క్‌ విధానంలో వీటిని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. నిజానికి.. ఒక ఎంఎస్‌ఎంఈ ఏర్పాటులో ఎక్కువ మొత్తం స్థలం కొనుగోలు, వాటి నిర్మాణానికే కేటాయించాల్సి రావడంతో ఆయా సంస్థలు వర్కింగ్‌ క్యాపిటల్‌కు ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి సౌకర్యాలతో కూడిన భవనాలను నిర్మించి వాటిని లీజు విధానంలో ఇస్తే వెంటనే ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు వర్కింగ్‌ క్యాపిటల్‌ ఇబ్బందులూ తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో ఈ విధానంలో రెండు క్లస్టర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు.  

కేంద్రానికి ప్రతిపాదనలు.. 
ఇక ఆయా జిల్లాల్లో ఉన్న డిమాండ్లను గుర్తించి వాటికి అనుగుణంగా రెండేసి క్లస్టర్లను ఎంపికచేసి వాటి ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎఫ్‌ఎఫ్‌సీల నిర్మాణ వ్యయంలో కేంద్రం 60 శాతం గ్రాంట్‌గా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించిందన్నారు. మొత్తం 26 జిల్లాలకు సంబంధించి 52 క్లస్టర్లను ఎంపిక చేశామని.. ఇందులో ఇప్పటికే 19 ప్రతిపాదనలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రానికి పంపినట్లు ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు.   


నాలుగేళ్లలో 12.61 లక్షల మందికి ఉపాధి.. 
ఇక సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్తగా 2,00,995 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.24,059 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 12,61,512 మందికి ఉపాధి లభించింది. గడిచిన ఆర్ధిక సంవత్సరం 2022–23లోనే 92,707 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.9,677 కోట్ల పెట్టుబడులతో 3,61,172 మందికి ఉపాధి లభించింది. ఇలా ఎంఎస్‌ఎంఈలు అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తుండటంతో వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి 15 రోజులకొకసారి సమీక్ష నిర్వహించి ఈ క్లస్టర్ల అభివృద్ధిపై కలెక్టర్లకు ఆదేశాలను జారీచేస్తున్నారు. తాజాగా జరిగిన  సమీక్షలో ఈ ఎఫ్‌ఎఫ్‌సీల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులను తక్షణం చేయాల్సిందిగా ఆయన కలెక్టర్లను ఆదేశించారు. అదే విధంగా కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు కూడా త్వరగా ఆమోదం లభించేందుకు ఏపీ భవన్‌ అధికారులతో సంప్రదింపులు నిర్వహించాలని కూడా కోరారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)