రేషన్‌ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Published on Sun, 01/01/2023 - 07:07

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. ఇప్పటిదాకా కిలో రూ.1కే అందిస్తున్న బియ్యాన్ని జనవరి నుంచి డిసెంబర్‌ వరకు (ఏడాది కాలం) ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో 1.46 కోట్ల బియ్యం కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డుదారులందరికీ ఏడాదిపాటు ఉచిత బియ్యం అందించనున్నట్టు ప్రకటించింది.

ఏపీలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులతో సమానంగా నాన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఏ కార్డుదారులకు కూడా ఉచితంగా బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ శనివారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యం పంపిణీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రేషన్‌ దుకాణాలు, ఎండీయూ వాహనాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇది ఒక్క బియ్యానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ 1967కు లేదా 18004250082 నంబర్‌ను సంప్రదించవచ్చని చెప్పారు. ఉచిత బియ్యం పంపిణీపై విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టి, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)