Breaking News

చంద్రబాబు కాన్వాయ్‌ వాహనాలకు భారీ ఖర్చు

Published on Fri, 07/17/2026 - 15:23

సాక్షి,అమరావతి: చంద్రబాబు కాన్వాయ్‌ వాహనాల కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను మంజూరు చేసింది. సరికొత్త వాహనాల కొనుగోలుకు రూ.18.66 కోట్లు కేటాయిస్తూ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు జీవోలను జారీ చేసింది. మూడు జామర్ వాహనాల కొనుగోలుకు అత్యధికంగా రూ.12.28 కోట్లు, మరో మూడు జామర్ వాహనాల కోసం రూ.3.74 కోట్లు కేటాయించారు. వీటితో పాటు భద్రతా కోసం ఆరు సరికొత్త ఫార్చూనర్ లగ్జరీ వాహనాల కొనుగోలుకు రూ.2.64 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

గత నెలలోనూ కాన్వాయ్‌ వాహనాల నిమిత్తం ప్రభుత్వం రూ.9.60 కోట్లు విడుదల చేసింది. అంతకుముందు జూన్ నెలలోనూ రెండు జామర్ వాహనాల కొనుగోలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ లెక్కన కేవలం నెల రోజుల వ్యవధిలోనే సీఎం కాన్వాయ్ మరియు భద్రతా వాహనాల కోసం ఏకంగా రూ.28.30 కోట్లను కూటమి ప్రభుత్వం ప్రజాధనం నుండి విడుదల చేయడం గమనార్హం.

ప్రధాని నరేంద్ర మోదీ తరహాలోనే సీఎం చంద్రబాబు కూడా తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించుకున్నారంటూ గత కొద్ది రోజులుగా అధికారిక వర్గాలు విస్తృతంగా ప్రచారం చేసుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కఠిన పొదుపు చర్యలు పాటిస్తామని ప్రకటించిన రెండు నెలల్లోనే.. తెరవెనుక ఈ స్థాయిలో కోట్ల రూపాయలను కొత్త వాహనాలకు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పొదుపు నీతులు చెబుతూనే, మరోవైపు కేవలం నెల రోజుల్లో వాహనాల కోసమే రూ.28.30 కోట్లు విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)