Breaking News

హెచ్చరిక..: ధర్నాలు, నిరసనలకు బాలలను తీసుకెళ్తే ఉపేక్షించం

Published on Sun, 10/08/2023 - 04:37

సాక్షి, అమరావతి: బాలలను రాజకీయ పార్టీల ప్రచా­రాలకు, ధర్నాలు, నిరసనలకు తీసుకెళ్తే ఉపేక్షించబోమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ హెచ్చరించింది. అందుకు బాధ్యులైన నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేయా­లని ఆదేశించింది. అవినీతి కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకు మద్దతుగా నారా భువనేశ్వరి నిర్వహించిన సభలో ఒక బాలుడితో మాట్లాడించిన అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

టీడీపీ సభలో సీఎం వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసేలా ఆ పిల్లాడిని ప్రేరేపించడం సరికాదని అభిప్రాయ పడింది. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ కేసలి అప్పారావు సభ్యులు జంగం రాజేంద్రప్రసాద్, త్రిపర్ణ ఆదిలక్ష్మీ, ఎం.లక్ష్మీదేవితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ కేసలి అప్పారావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు చిన్నారులను తమ రాజకీయాలకు వాడుకోవడంపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

బాలలను రాజకీయ ప్రచారాలకు, ప్రసంగాలకు, వేడుకలకు, ధర్నాలకు, ఊరేగింపులకు ఉపయోగిస్తే వారికి బాలల హక్కుల కమిషన్‌ నుంచి సంజాయిషీ నోటీసులు జారీ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అసభ్యకర పదజాలంతో, అసహ్యకర వ్యాఖ్యలతో ప్రసంగాలు చేయించటం ద్వారా బాలల మనస్సులో విష బీజాలు నాటడం సరికాదన్నారు.

ఇటువంటి చర్యల వల్ల పిల్లలు చదువుపై ఆసక్తి సన్నగిల్లి పెడతోవ పట్టే ప్రమాదం ఉందన్నారు. బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం 18 ఏళ్లలోపు వారిని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు, సదస్సులు, సమావేశాల్లో భాగస్వామ్యం చేయకూడదని స్పష్టం చేశారు. బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)