Breaking News

వక్ఫ్‌ సవరణ బిల్లుకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం

Published on Sun, 09/29/2024 - 05:40

సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌/­కర్నూలు­(టౌన్‌): ముస్లిం సమాజానికి నష్టం తెచ్చే వక్ఫ్‌ సవరణ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వైఎస్సార్‌సీపీ తాజాగా మరోసారి స్పష్టమైన వైఖరిని చాటింది. వక్ఫ్‌ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్మన్‌ జగదాంబికా పాల్‌కు పార్టీ తరఫున జేపీసీ మెంబర్, ఎంపీ వి.విజయ­సాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ శనివారం రాతపూర్వకంగా లేఖ అందజేశారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని లేఖలో స్పష్టం చేశారు. అనంతరం హఫీజ్‌ఖాన్‌ మీడియాతో మాట్లా­డుతూ ముస్లిం సమాజం ఇబ్బంది పడకూ­డదనే ఉద్దేశంతోనే ఈ సవరణ బిల్లును వ్యతిరేకించాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా స్పష్టంగా చెప్పార­న్నారు.

జేపీసీ సమావేశంలో ఈ బిల్లును తమ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందో లిఖితపూర్వకంగా తెలియజేశామని పేర్కొ­న్నారు. ఈ సవరణ బిల్లుకు వైఎస్సార్‌సీపీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని జేపీసీకి వివరించామ­న్నారు. వక్ఫ్‌ భూములకు సంబంధించి కలెక్టర్‌కు అథారిటీ ఇవ్వాలనుకోవడం సరికాద­న్నారు. వక్ఫ్‌ భూములకు ప్రత్యేకంగా ఉన్న వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ను బలహీనపరిచేలా సవరణ బిల్లు ఉంద­న్నారు.

ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందన్నారు. ఇప్పటికే లోక్‌సభ­లో మిథున్‌రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డి సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, తాము ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో చెప్పార­న్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ జేపీసీ మెంబర్‌ విజయసాయిరెడ్డి సైతం బిల్లుకు వ్యతిరేకంగా లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారని పేర్కొన్నారు. 

టీడీపీది డబుల్‌ గేమ్‌
టీడీపీ పార్లమెంట్‌లో ద్వంద్వవైఖరి అవలంబించడంతోపాటు సవరణ బిల్లు విష­యాన్ని గందర­గోళంలో పడేస్తోందని హఫీజ్‌ఖాన్‌ మండిపడ్డారు. ఇప్పుడు కూడా టీడీపీ రెండు కళ్ల ధోరణి అనుసరి­స్తోందన్నారు. పార్లమెంట్‌లోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే జేపీసీ వరకు వచ్చేది కాదన్నారు. పార్లమెంట్‌లో సవరణ బిల్లుకు మద్దతు పలికిన టీడీపీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీతోపాటు వివిధ ముస్లిం సంఘాలు వక్ఫ్‌ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా టీడీపీ మాత్రం డబుల్‌ గేమ్‌ ఆడుతూ ముస్లింలకు మరోసారి ద్రోహం చేస్తోందని విమర్శించారు. టీడీపీ నాటకాలను ముస్లిం సమాజం గమనించాలని హఫీజ్‌ఖాన్‌ కోరారు.

‘వక్ఫ్‌ బిల్లు’పై జేపీసీకి పలు సూచనలు చేశాం: మంత్రి ఫరూక్‌ 
కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న వక్ఫ్‌ సవరణ బిల్లు–2024పై ముస్లిం సమాజం నుంచి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో. అభిప్రాయ సేకరణకు వచి్చన జేపీసీకి ఏపీ తరఫున పలు సూచనలు చేసినట్టు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన జేపీసీ అభిప్రాయ సేకరణ సమావేశానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ నుంచి 15 మంది కమిటీని పంపినట్లు మంత్రి పేర్కొన్నారు. జేపీసీ చైర్మన్‌ జగదాంబిక పాల్‌కు రాతపూర్వకంగా వినతిపత్రాలు సమరి్పంచినట్లు తెలిపారు.  

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)